పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.వచ్చేబ్రహ్మోత్సవాలు కూడా గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవం ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన కృషిచేసినగ్రామస్థులకు,నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.