
Sitaram Yechury’s Anniversary Observed
ఘనంగా సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏచూరి ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చిన సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రామిక భవన్లో కామ్రేడ్ సీతారాము ఏచూరి ప్రథమ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ సీతా రామ్ ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పూలమాల లేచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుర్రం దేవేందర్ అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంధు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారామయ్య చూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారు. వారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నివాసి. వారి తాత మద్రాసు హైకోర్టులో. వారి తల్లి కలపకం దుర్గాబాయి తో కలిసి పని చేశారు. ఏచూరి మేనమామ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీప్ సెక్రెటరీగా పనిచేశారు మోహన్ కందా సీతారాం ఏచూరి వారి మేనమామ సాయంతో హైదరాబాదు ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో స్వర్గా పాల్గొన్నటువంటి నాయకుడు. బెంగాల్ నుంచి రెండుసార్లుగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటరీగా పనిచేశారు. సాధారణంగా జీవించి ఉన్నతంగా ఆలోచించారు సీతారాం ఏచూరి గారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజలను విముక్తి కోసం కూడి లేని వాళ్లకు కూడు పెట్టాలని జాగ లేని వాళ్లకు జాబు ఉండాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించబడాలని. ధరలు తగ్గించాలని. పేద ప్రజల రాజ్యం రావాలని, కార్మిక వర్గ నాయకత్వన విప్లవం విజయవంతం కావాలని పోరాడినటువంటి వ్యక్తి. దోపిడికి వ్యతిరేకంగా పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి. వారి ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ శ్రేణులంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమర సమరశీల పోరాటాలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆకుదారి రమేష్, గడప శేఖర్, గడ్డం భాస్కర్, చిలుక బిక్షపతి, మేకల మహేందర్, జ్ఞానేశ్వరి, డి రాజేశ్వరి, గూట్ల రాజేశ్వరి, మామిడిలా రాధా, షేక్ జూబ్లీ, కాదాసీ సుగుణ, తదితరులు పాల్గొన్నారు.