వీణవంక మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో
శ్రీ రామనవమి పర్వదినాన్ని ఘనంగా ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది
చిట్టి మల్ల హరిబాబు – శారద దంపతులు స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు రాంపల్లి రామకృష్ణ శర్మ, రాంపల్లి వంశీకృష్ణ శర్మ ఆ చార్యులు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపగా, తీర్థ ప్రసాదాలు ప్రత్యేక అర్చకుల వేద మంత్రోచ్చారణ ల మధ్య అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం జరిగింది, ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము రాముని జీవితం భారత దేశానికి చిహ్నం లాంటివాడు రాముడు కాబట్టి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆలయ అర్చకులు అన్నారు భక్త జనం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మారు మొరోగించి అలాగే ఆలయాల వద్ద అన్న దాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ భక్తులు, పెద్దపల్లి రాజయ్య, దాట్ల శ్రీనివాస్, కాసర్ల అనిల్, కాసర్ల సమ్మయ్య,దాట్ల మంగ, నల్లగాస శ్రీనివాస్ ,కోట వెంకటరెడ్డి, రామ్ రెడ్డి,నారాయణరెడ్డి శంకరయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
