”కేసీఆర”ను పిలవడం అంత “ఆశ మాసి కాదు”?
`సహజంగా కేసుల విషయంలో ప్రభుత్వ వాదన బలంగా వుంటుంది?
`ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రతి పక్షం గట్టిగా వుంది?
`ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమే అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా
అన్నారు?
`తన ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని పదే పదే చెప్పారు?
`అప్పట్లోనే ఎందుకు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టలేదు?
`అధికారం లోకి వచ్చిన నాటి నుంచి సాగదీస్తున్నారు?
`ప్రభాకర్ రావు రాగానే అంతా అయిపోతుందన్నారు?
`ప్రభాకర్ రావు ను అనేక సార్లు విచారించారు?
`ఇప్పుడు బాండ్స్ ట్యాపింగ్ ఆధారంతో వసూలు చేసారంటున్నారు?
`తమను భయపెట్టి బాండ్స్ తీసుకున్నట్లు ఒక్కరైనా చెప్పారా?
`కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నాయకులు ఇదే మాట అంటున్నారు?
`అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అవే కంపెనీలు ఇచ్చాయి?
`అందులో దాపరికం లేదు, వుండదు?
`తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు బీజేపీ నాయకులు అనేక మంది చెప్పారు?
`వారిలో ఒక్కరైనా కంప్లైంట్ ఎందుకివ్వలేదు?
`ఫోన్ ట్యాప్ లో రెండో సిట్ వేశారు?
`హరీష్ రావును నిందుతునిగా విచారణకు పిలువలేదు?
`కేటీఆర్ ను,సంతోష్ రావు ను పిలిచారు?
`వారిని కూడా సాక్షలుగానే పిలిచారు?
`నెక్స్ట్ మాజీ సీఎం “కేసీఆర” ను పిలుస్తారని మీడియా లో వార్తలు వస్తున్నాయి?
`అవగాహన లేని వ్యక్తులు మీడియాలో తయారయ్యారు?
చట్టం మీద కనీస అవగాహన వారిలో శూన్యం?
మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం అంత ఆశమాషి కాదు?
`ఫోన్ ట్యాప్ విషయంలో “కెసిఆర” ను ఏరకంగా పిలుస్తారు?
`నిందితునిగా పిలిచే అవకాశం లేదు?
`సాక్షులుగా పిలిచే సందర్భం అసలే కాదు?
”కేసీఆర” ను పిలిస్తే అప్పటి డీజీపీని పిలవాల్సి ఉంటుంది?
అప్పటి హోం సెక్రటరీని పిలవాల్సిన అవసరం ఉంటుంది?
`ఇంటెలిజెన్స్ ఐజీని కూడా పిలిచి “కేసీఆర” ముందు కూర్చో బెట్టాలి?
`ఇప్పటి వరకు అప్పటి అధికారులు సిఎం చెబితేనే చేశామని ఎక్కడా చెప్పలేదు?
`మాజీ సీఎం “కేసీఆర” ను సాక్షిగా పిలిచి ఫోన్ ట్యాప్ మీద అనుమానం ఉందా అని
అడుగుతారా?
`కాళేశ్వరం వంటి అంశం మీద నోటీస్ అనేది సాహెతుకం?
`ఫోన్ ట్యాప్ లో మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం సాధ్యమా?
`”కేసీఆర” ను ముందు కూర్చో బెట్టుకొని ప్రశ్నలు అధికారులు అడగ గలరా?
`ఇప్పటి వరకు సాక్షులుగా వెళ్లిన వారితో ఇన్ని ఫోన్ నెంబర్లు ఎక్కడివి అని అడిగినట్లు
మీడియాలో వచ్చింది?
`సామాన్యుల ఫోన్ లోనే వేలాది నంబర్లు ఉంటున్నాయి?
`హరీష్,కేటీఆర్,సంతోష్ వద్ద వేలాది నెంబర్లు ఉండడం విచిత్రమా?
`నిజం కానీ అబద్దం లో సాగదీత తప్ప ఏమీ లేదు?
`ఇంకా తెలంగాణా ప్రజలను మాయ చేయడం సాధ్యం కాదు?
`ట్యాప్ విషయంలో కొండను తవ్వినా ఎలుక కూడా దొరకదు?
`ప్రతిపక్షం మీద పగ సాధిస్తా అనేలా ఉన్నా నెరవేరడం కనిపించడం లేదు?
నేటిధాత్రి:
రెండు సంవత్సరాలుగా జీడి పాకం సాగుతున్నట్లు నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులు రకరకాల మలుపులు తిప్ప్పుతున్నారు. ఇంత కాలం సాగి, సాగి ఇప్ప్పుడు జోరుమీద వున్నట్లు మరో ప్రయత్నం గట్టినే చేస్తున్నారు. కాని అది గట్టి కేసా? లేక బిఆరఎస్ నాయకులు అంటున్నట్లు లొట్టపీసా? అనేది తేలడానికి కూడా ఇంకా సయమం తీసుకుంటారా? అనేది తేలాల్సి వుంది. ఇప్పటి వరకైతే బిఆరఎస్ నాయకులు చెబుతున్నదే నిజమౌతోంది? గత వారం రోజుల హడావుడిలో ముగ్గురు నాయకులను సిట్ పిలిచింది. అది కూడా సాక్ష్యులుగా మాత్రమే విచారించింది. ఇంత వరకు సరే..కాని ఇప్ప్పుడు తర్వాత పిలిచే ఏకంగా మాజీ సిఎం. కేసిర్? అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి వార్తలు మీడియా సంస్దలు కూడా పనిగట్టుకొని చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించడం అనేది అంత సులువైన పనికాదు. చట్టం తల్చుకుంటే ఏదైనా చేయొచ్చు? అనేది అన్ని విషయాలకు వర్తించదు. గత ప్రభుత్వాధినేతను ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించాలంటే ఆశామాషీ కాదు? ఒక వేళ పిలిచారే అనుకుందాం? ఏ అంశాన్ని ప్రస్తావించి పిలుస్తారు? నిందుతుడిగా పిలిచే అవకాశం అసలే లేదు? సాక్షిగా పిలిచే సందర్భం అసలే ఉత్పన్నం కాదు? కేసిఆర్‌ను అందుకు బాధ్యుడిని చేయడం అంత సులువైన పని అసలే కాదు? ఇంకా ఎలా పిలుస్తారు? ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? కాకతాళీయంగా ఏ మీడియా ఇలాంటి వార్తలు రాయడానికి కూడా ముందుకు రాదు? ఎలాంటి సంకోచం లేకుండా రాస్తున్నారంటే అందులో ప్రభుత్వ ప్రోద్భలం లేకుండా వుండదు? ఎందుకంటే మీడియా పెద్దలకు చట్టం గురించి తెలియంది కాదు? చట్ట పరిధిని దాటి మీడియా వార్తలు రాసే అవకాశం లేదు? ఒక వేళ రాస్తే వారికి ఎలాంటి అవగాహన లేదన్న సుస్పష్టం. చట్టం మీద ఎలాంటి అవగాహన లేకుండా వార్తలు రాస్తే చిక్కుల్లో పడతామన్న కనీస జ్ఞానం లేని వాళ్లు మాత్రమే అలాంటి వార్తలు రాస్తారు. సిట్ అధికారులు తాము ఎ మీడియా సంస్ధకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని లిఖిత పూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. అయినా లేని పోని వార్తలు ఎందుకు వస్తున్నాయి? అలా వార్తలు రాసే వారి మీద కూడా చర్చలు తీసుకునే అధికారం సిట్ అదికారులకు వుంది. అయినా ఎందుకు చూసి చూడనట్లు వుంటున్నారు? మీడియా ఊహాగానాలు రాస్తుంది? కాని కొన్ని విషయాల్లో ఊహాగానాలు అనేవి ఊరికే రావు? నిప్ప్పులేనిదే పొగ రాదన్న సామెత తెలియంది కాదు? అధికారులు లీకులు ఇవ్వకపోయినా పాలకపెద్దలు ఇచ్చే లీకులు కూడా వుంటుంటాయి? అదికూడా ఇలాంటి కేసుల్లో లీకులు సముచితం కాదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేద సామాన్యమైన విషయం కాదు. అలాంటి కేసుల్లో ఊహాగానాలకు తావుండదు. పక్కా సమాచారం వుంటే తప్ప కేసు నిలబడదు? సహజంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్రం అనుమతితో ఖచ్చితంగా వుంటుంది. కేంద్ర ఫ్రభుత్వానికి తెలియకుండా దేశ రక్షణ విషయంలో చీమ కూడా చిటుక్కుమనే అవకాశమే లేదు. పాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాదారణం అనేది కూడా అందరకీ తెలిసిందే. దాన్ని రాద్దాంతం చేస్తూ పోతే ఇలా జీడిపాకమే అవుతుందే తప్ప మరేం తేలదు. 1861 టెటీగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. గతంలో కర్నాటక సిఎం.గా పనిచేసిన రామకష్ణ హెడ్డే పదవి పోగొట్టుకున్నారు. అప్పటి పరిస్ధితుల్లో పూర్తి సాక్ష్యాదారాలలో కేసులు నమోదు చేశారు. మరి తెలంగాణలో రెండేళ్లులో ఒక్క సాక్ష్యం లేదు. ఒక్క అధికారిక దవీకరణ లేదు. దానిపై ఎవరూ పిర్యాధు చేసింది లేదు? ఏ ఒక్కరు తమకు అన్యాయం జరిగిందని చెప్పింది లేదు? తమను బిఆరఎస్ పెద్దలు బెదిరించారన్నదానిపై కేసులు లేవు? కాని ఎన్నికల ముందు చేసిన రాజకీయ హడావుడిని వదిలేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందు వేసుకున్నది? ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తాయనుకున్నప్ప్పుడల్లా తెరమీదకు తెస్తున్నది అని అంటున్న బిఆరఎస్ వాదనలో నిజం కూడా కనిపిస్తోంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత పాలకపక్షంలో కీలకభూమిక పోషించిన కేటిఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావులను నిందితులుగా పిలవలేదు. ఎందుÅ£ంటే వారి మీద కేసులు నమోదు కాలేదు. ఇక వారిని సాక్ష్యులుగా మాత్రమే పిలిచారు. వారి వంతు అయిపోయింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను పిలుస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ ఆ వార్తలే నిజమనుకుంటే కేసిఆర్‌ను పిలిచి విచారిచండం అంత సులువైన పని కాదు. అంత ఆశామాషీ వ్యవహరం కాదు. ఎందుకంటే గత పదేళ్లు ఆయనే పాలకుడు. నిత్యం ఇంటలిజెన్స్ అదికారులు అన్ని విషయాలు చెబుతారు. రాష్ట్రంలో ఏదైనా అశాంతి నెలకొనేలా వుందనుకున్నప్ప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందిన సమాచారాన్ని మాత్రమే కేసిఆర్‌కు వివరిస్తారు. ఇంతకు మించి కేసిఆర్‌కు కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశమే వుండదు. ఒక వేళ వుందని అనుకున్నా.. ఆ సమయంలో పనిచేసిన డిజీపిలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో పిలవాల్సిన అవసరం వుంటుంది. ఫోన్ ట్యాపింగ్‌ను హాండిల్ చేసే ీVAం సెక్రెటరీలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో ఆయన ముందు హజరుపర్చాల్సివుంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు? అయినా మాజీ సిఎం. కేసిఆర్‌కు నోటీసులు ఇస్తారంటూ వార్తలు రావడం విడ్డూరం. ఒక వేళ కేసిఆర్‌ను కూడా సాక్ష్యంగా పిలిస్తే ఏమని ప్రశ్నిస్తారు? మీ ఫోన్ ట్యాప్ అయ్యిందా? అని అడుగుతారా? ఏమని విచారిస్తారు? ఇప్ప్పుడున్న అదికారులు కేసిఆర్‌ను విచారించేంత ధైర్యం చేస్తారా? సాద్యమౌతుందా? ప్రభుత్వం చెప్పినట్లు చేసే సమయంలో కేసిఆర్‌కు నోటీసులిచ్చేంత సాహసం చేస్తారా? గతంలో ఎన్నికల ముందు పదే పదే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందన్న అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే పోలీసులకు పిర్యాధు చేశారా? ఆఖరుకు హరీష్‌రావు మీద పిర్యాధు చేసిన వ్యక్తిలాగా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు ధైర్యం చేయలేదు? పిర్యాధులు ఎందుకు చేయలేదు? తమ ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెప్పే బిజేపి నాయకులు కేంద్రంలో అదికారంలో వుండి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? కేంద్ర ీVAం శాఖ సహాయ మంత్రిగా వున్న బండి సంజయ్ తన ీVAదాను మర్చిపోయి రాజకీయం చేస్తుండడం సమంజసమేనా? నిజంగా ఆయనకు అనుమానం వుంటే ఎందుకు ఇప్పటి వరకు పిర్యాదు చేయలేదు. కేంద్రం నుంచి ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు? తన ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెబుతున్న కవిత ఎందుకు ఇ ంత వరకు పిర్యాధు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల స్దాయిలో జరిగేది కాదు? అదికారులు మంత్రుల ఎంత సమర్దులైన వివరాలు చెప్పే ఆస్కారం వుండదు. అయినా చట్టం గురించి, చరిత్ర గురించి, పాలనా పరమైన విషయాల గురించి, పరిపాలనలో వుండే ఇబ్బందుల గురించి తెలిసిన కేసిఆర్ అలా ఫోన్ ట్యాపింగ్‌లు చేయిస్తారా? నిజంగానే ఆ ట్యాఫింగ్లు నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? నాయకులు ఎన్నికల్లో గెలిచేవారా? బిఆరఎస్ పార్టీ ఓడిపోయేదా? ఇక తాజాగా బిఆరఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ తో పెద్దఎత్తున ఎలక్రోరల్ బాండ్లు సేకరించిందని కూడా కాంగ్రెస్ నాయకులు, బిజేపి నాయకులు అంటున్నారు. దేశంలో అత్యధిక ఎలక్రోరల్ బాండ్లు సేకరించిన పార్టీగా బిజేపి ముందు వరుసలో వుంది. ఈ పన్నెండేళ్ల కాలంలో సుమారు 13వేల కోట్ల రూపాయల ఎలక్రోరల్ బాండ్లు సేకరించినట్లు వివరాలున్నాయి? ఇదంతా బహరింగ రహస్యమే? ఇందులో ఫోన్ ట్యాపింగ్ ఏమి వుంటుంది? ఒక వేళ అదే నిజమైతే ఏ ఒక్క పారిశ్రామిక వేత్త అయినా బైటకు వచ్చి చెప్పారా? తమను బిఆరఎస్పార్టీ వేధించడం వల్లనే ఎలక్రోరల్ బాండ్లు ఇచ్చామని కేసులు పెట్టారా? దేశంలో అన్ని పార్టీలకు అందరు పారిశ్రామిక వేత్తలు ఎలక్రోరల్బాండ్లు ఇస్తారు. బిజేపికి , కాంగ్రెస్‌కు ఇచ్చిన వాళ్లే, బిఆరఎస్‌కు కూడా ఇచ్చారు. తలాతోక లేకుండా కొత్త కొత్త ఆరోపణలు తెరమీదకు తెచ్చి ఫోన్ ట్యాపింగ్‌ను రెండేళ్లుగా సాగి, మూడో ఏడుకు కూడా నడుస్తోంది. ప్రజా సమస్యలను చాలా పక్కాగా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బిఆరఎస్ విమర్శిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనే కేసుల లొట్టపీసు అని అందుకే అంటోంది!!
