
Sirikonda Prashanth
తండ్రికి తగ్గ తనయుడు సిరికొండ ప్రశాంత్
-సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
-మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడి భుజంలా ఉంటూ..2021లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యవస్థాపక సభ్యుడిగా..పొలిట్ బ్యూరో సభ్యుడిగా కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు ఉవ్వెత్తున ఉగిసి పడేలా కార్యాచరణను రూపొందించిన అపర మేధావి మాజీ స్పీకర్..ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అన్నారు. శుక్రవారం సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని..బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కేక్ ను చదువు అన్నారెడ్డి కట్ చేసి సిరికొండ ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిరికొండ ప్రశాంత్ తండ్రి సిరికొండ మధుసూదనా చారి అడుగుజాడల్లో పయనిస్తూ..ఏ పదవి లేకున్నా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేస్తూ..ఎవరికి ఏ ఆపదోచ్చినా తానున్నానంటూ..భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజల మన్ననలను పొందుతున్నయువనేతగా ఆయనకు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ చింతలపల్లి దార్ల ఆనంద్ అరికాంతపు అన్నారెడ్డి, దేవునూరి కుమారస్వామి, కక్కెర్ల ప్రశాంత్ గౌడ్, గుడిమల్ల రమేష్, ఎరబాటి మహేందర్, మల్సాని బాపురావు, రాస శ్రీనివాస్, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.