
సిరిసిల్ల గజల్ కవి బూర దేవానందంకు ఘన సన్మానం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
హైదరాబాద్ రవీంద్రభారతి లో తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖకవి, కళారత్న, బిక్కి కృష్ణ అధ్యక్షులుగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, మామిడి హరికృష్ణ, మల్లతీగ పత్రిక ఎడిటర్ కలిమిశ్రీ సినీగీత రచయిత మౌనశ్రీ ముఖ్య అతిథిలుగా ప్రఖ్యాత గజల్ కవయిత్రి విజయ గోలి రచించిన నవరాగిణి గజల్ పుస్తకావిష్కారణ గజల్ విభావరి ఎంతో ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమనికి సిరిసిల్ల గజల్ కవి బూర దేవానందంను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.. వారిని జ్ఞాపిక శాలువ ప్రత్యేక బహుమతులతో ఘనంగా సన్మానించారు..గజల్
కవి, బూర దేవానందంను సిరిసిల్ల మారసం, సిసాస, జిరసం, అధ్యక్షులు కార్యదర్శులు కవులు రచయితలు అభినందించారు.