సిరిసిల్ల మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా టీ.వీ నారాయణ, మరియు కేంద్ర బాల సాహిత్య పురస్కార గ్రహీత (NBT) అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. (మారసం) నూతన అధ్యక్షుడిగా గెంట్యాల భూమేష్, మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ కందేపి రాణి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బూర దేవానందం, చిటికెన కిరణ్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా జి. శ్రీమతి,అనిత చరణ్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఏలగొండ రవి, కార్య నిర్వహణ కార్యదర్శిగా జిందం అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా అల్లే రమేష్, అంకారపు రవి, యువ కార్యదర్శిరాలుగా ఈడెపు సౌమ్య, మరియు మారసం సభ్యులుగా కామవరపు శ్రీనివాస్,దూడం గణేష్, పోకల సాయికుమార్,వంశీ, నర్సింములు,సౌమ్య సభ్యులు ఎన్నుకోవడం జరిగినది.