*రెవెన్యూ శాఖలో అధికారుల కీలక మార్పులు*
*”నేటిధాత్రి”,హైదరాబాద్* తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో కీలక మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇద్దరు అదనపు కలెక్టర్లు, 10 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
*ఈ బదిలీలలో భాగంగా:*
*వెయిటింగ్‌లో ఉన్న ఎన్. ఖీమ్యా నాయక్‌ను వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించారు.*
*బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీగా ఉన్న కే. చంద్రారెడ్డి రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా మారారు.*
*భద్రాచలం ఆలయం ఈవో ఎల్. రమాదేవిని ఆర్అండ్‌బీ శాఖకు బదిలీ చేశారు.*
*వెయిటింగ్‌లో ఉన్న బి. రాజా గౌడ్ హనుమకొండ డీఆర్వోగా బాధ్యతలు చేపట్టనున్నారు.*
*ఎల్. సుధను నల్లగొండ స్పెషల్ కలెక్టర్ (పీఏ)గా నియమించారు.*
*ఎస్. అశోక్‌ను ఆర్అండ్‌బీకి పంపించారు.*
*ఎల్. రాజేందర్ గౌడ్ నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు*
*సీహెచ్. కోమల్ రెడ్డి మహబూబ్‌నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.*
*కే. దామోదర్ రావు దేవాదాయ శాఖకు*
*పి. హరికృష్ణను ఆర్అండ్‌బీకి బదిలీ చేశారు.*
*మైనారిటీ వెల్ఫేర్ శాఖలో ఉన్న ఎంపీ. జనార్ధన్ రెడ్డిని కల్వకుర్తి ఆర్డీవోగా నియమించారు.*
*పీసీబీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఎం. జయమ్మ భువనగిరి ఆర్డీవోగా నియమించారు*
*ఇతర నియామకాలు, బాధ్యతల అప్పగింతల వివరాలు త్వరలో ప్రకటనలో వెల్లడయ్యే అవకాశం ఉంది.*