చలితో ఢిల్లీల కనిపించిన సిరిసిల్లఅయ్య బాబోయ్ చలి పులి
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మరియు పరిసర గ్రామాలలో పొగ మంచు ఢిల్లీ లా కనిపించి, వాతావరణం లోని మార్పుల ఆధారంగా నేడు ఉదయం తొమ్మిది అవుతున్న సూర్యుడి రాలేని పరిస్థితి, అలాంటి సమయంలో సిరిసిల్లను పొగ మంచుతో కప్పేసింది. ఇది చూసినటువంటి పట్టణ ప్రజలని కనువిందు చేసింది.
శీతాకాలంలో వాతావరణం లో మార్పుల ఆధారంగా సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డులలో విద్యానగర్, సుభాష్ నగర్, నెహ్రూ నగర్, తదితర కాలనీలలో విపరీతంగా ఒక మంచి తో సిరిసిల్ల పట్టణాన్ని ఒక రాకశిలా కప్పి వేయడం ద్వారా ఉదయం పలు వ్యాపారస్తులు వ్యవసాయ దారులు, పాలు ఉత్పత్తిదారులు, కూరగాయల వ్యాపారస్తులకు కనిపించకుండా రహదారి వెంబడ పొగ మంచుతో ఉండడంతో సిరిసిల్ల ప్రజలుభయభ్రాంతులయ్యారు.
వాతావరణం లోని మార్పుల ఆధారంగా పలు పిల్లలకు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు,జిల్లాలోని వైద్య, డాక్టర్లు అధికారులు ప్రజలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సిరిసిల్ల ప్రజలు కోరడం జరిగినది.
