కోహీర్: హైవేపై కారు దగ్ధం….
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలంలోని దిగ్వాల్ వద్ద 65వ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కారు దగ్ధమైంది. బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు సకాలంలో కారు దిగి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కారు ఇంజిన్ లో మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
