గని కార్మిక సంఘo రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రగిరి శంకర్
విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కార్మికుల క్రమ శిక్షణా చర్యలకు సంబంధించి ఇటీవల సింగరేణి యాజమాన్యం జారీ చేసిన పసుపు కార్డు,రెడ్ కార్డు ఉత్తర్వులు నిరంకుశమైనవని ఈ సర్క్యులర్ అమలు తో కార్మికులు విధి నిర్వహణలో తీవ్ర భయ బ్రాంతులకు గురవుతున్నారన్నారు, వెంటనే పసుపు కార్డు, ఎరుపు కార్డులను రద్దు చేయాలనీ భూపాలపల్లి ఏరియా టీఐఎఫ్టీయూ కార్మిక సంఘం డిమాండ్
గనులలో లేదా పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగితే కేవలం కార్మికుల్ని మాత్రమే పూర్తి బాధ్యుల్ని చేసే అప్రకటిత నిర్బంధం ప్రయోగించి చార్జ్ షీట్లు, మెమొలు, సస్పెండెడ్ పెండింగ్ ఎంక్వయిరీ ,షోకాస్ నోటీసులు ఇవ్వడంతో పాటు కార్మికుల్ని మానసికంగా వేధించే ఈ సర్క్యులర్ రద్దు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు,ఉత్పత్తి లక్ష్య సాధనతో పాటు పూర్తిస్థాయి రక్షణ చర్యలపై కూడా యాజమాన్యం దృష్టి పెట్టాలి అప్పుడు మాత్రమే ప్రమాదాలు నివారించబడతాయని వారు అభిప్రాయపడ్డారు, ఏ తరహా నేరస్తుడో పలకపై అక్షరాలు దిద్ది దోషి మెడలో వేలాడదీసిన నాటి బ్రిటిష్ బానిస సామ్రాజ్యపు కఠిన నిబంధనలు ప్రజాస్వామిక దేశంలో సరికాదని ఈ విధానం కార్మికుల పట్ల యాజమాన్యం వ్యవహరించే అమర్యాద చర్యగా వారు అభివర్ణించారు,వెంటనే సంబంధిత సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామూ, దీనికి ఐ ఎన్ టీ యూ సి ఎఐటీయూసి యాజమాన్యంతో చర్చించి ఈ సర్క్యులర్ ను రద్దు చేసే బాధ్యత వీరిదే…..ఈ కార్యక్రమంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు రాజేశం.. రాములు, రమేష్ ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.