
కార్మికులకు దండలు వేసి దీక్షను ప్రారంభించిన కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలం వేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఈ దీక్షను ఏఐటీయూసీ ప్రాధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులకు దండాలు వేస్తూ దీక్షలను ప్రారంభించారు. మొదటి రోజులో భాగంగా భూపాలపల్లి ఏరియా కేటీకే వన్ ఇంక్లైన్ ఫిట్ కమిటీ నాయకులు కార్మికులు దీక్షలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా జిఎం కార్యాలయాల ముందు రిలే దీక్షలను నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణినీ ఈ తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని అన్నారు.సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని వెంటనే సింగరేణిలో బొగ్గును వెలికి తీసే ప్రక్రియ సింగరేణికి ఇవ్వాలని వేలం వేయవద్దని అన్నారు,సింగరేణి నీ కాపాడుకోవడం కోసం పలు దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తామని అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా నిలబడాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో సింగరేణి గని కార్మికుల సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంకు వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని దొంగ హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, విజేందర్, చంద్రమౌళి జి శ్రీనివాస్ క్యాథరాజు సతీష్ సుమారు వందమంది కార్మికులు పాల్గొన్నారు.