
Labor union leaders
గనిలో సైడ్ వాల్ కూలి సింగరేణి కార్మికుడు మృతి
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి సింగరేణి కేకే 5 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది గనిలో సైడ్ కోల్ కూలి ఎస్డిఎల్ ఆపరేటర్ శ్రావణ్ కుమార్ (32) ప్రమాదవశాత్తు మృతి చెందారు రాత్రి రెండో షిఫ్ట్ లో పనిచేస్తుండగా ఎస్ డి ఎల్ మిషన్ మోరాయించగా శ్రావణ్ కుమార్ మిషన్ ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పక్కనుండి నుండి సైడ్ వాల్ కూలగా మిషన్ సైడ్ కోల్ మధ్యలో ఇరుక్కుపోయాడు అది గమనించిన తోటి కార్మికులు శ్రావణ్ కుమార్ ను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మాధ్యమధ్యంలోని మృతి చెందాడు.
అధికారుల ఒత్తిడితోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.