
మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం
సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ
జైపూర్,నేటి ధాత్రి:
మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల,జనరల్ సెక్రెటరీ భూక్యా నాగేశ్వరరావు గురువారం దనుసరి సీతక్క పంచాయతీరాజ్ రూరల్ గవర్నమెంట్,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ని, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ని ప్రజా భవన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు.ఆగస్ట్ 10న జరిగిన కేంద్ర కమిటీ ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యుల వివరాల ప్రక్రియను వివరించారు.అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కి మినిస్టర్ సీతక్కని గౌరవ అధ్యక్షులుగా ఉండాలని సెంట్రల్ కమిటీ సభ్యులు కోరారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సింగరేణిలో గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, అధికారుల ప్రమోషన్లలో క్లస్టర్,ఇంటర్ క్లస్టర్ ప్రమోషన్లలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని,రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ లో కూడా ప్రమోషన్ పాలసీకి సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు.అలాగే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని
సెంట్రల్ కమిటీ సభ్యులు వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి సానుకూలంగా స్పందిస్తూ గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ రూపంలో తమ దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయిస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో చీఫ్ లైజాన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.తిరుమల్ రావు,జిఎం సివిల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.