
జైపూర్, నేటి ధాత్రి:
కోల్ ఇండియా స్థాయిలో జరుగుతున్న ఇంటర్ కంపెనీ క్రీడా పోటీల్లో సింగరేణి జట్టు ఫైనల్స్ కు చేరుకోవడం పై సంస్థ చైర్మన్ మరియు ఎండి బలరాం వీడియో కాల్ ద్వారా సింగరేణి జట్టుకు తమ అభినందనలు తెలియజేశారు. సింగరేణి జట్టులోని క్రీడాకారుల అందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో క్రీడా స్ఫూర్తితో ఆడుతూ సింగరేణి పేరును కాపాడాలని ఆయన కోరారు. సంస్థ చైర్మన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి అభినందించడంపై సింగరేణి క్రీడాకారులు ఆనందంతో పొంగిపోయారు.