జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ టి పిపి టౌన్ షిప్ మహిళలకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు భవాని-బసివి రెడ్డి పాల్గొనీ, జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఇందులో భాగంగా మహిళలకు బాంబ్ ఇన్ దా సిటీ, పాసింగ్ ద బాల్ మరియు లక్కీ లేడీ వంటి ఆటలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్రవంతి- వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని, మహిళా ఆర్థిక మానసిక సాధికారత కోసం సింగరేణి సేవా సమితి ద్వారా ప్లాంట్ ప్రభావిత గ్రామ ప్రజలకు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్త్రీలు ఎప్పుడు తమని తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, మహిళలు తలుచుకుంటే జరగలేనిది ఏమీ లేదని, అలాగే
అమ్మని పూజిద్దాం
భార్యని ప్రేమిద్దాం
సోదరిని ఆశీర్వదిద్దాం
ముఖ్యంగా స్త్రీలను గౌరవిద్దాం అని నినదించారు.
ముఖ్య అతిథి భవాని- బసివి రెడ్డి మాట్లాడుతూ ఒక మహిళగా పుట్టినందుకు మనం చాలా గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా శ్రామిక మహిళా దినోత్సవం గా మొదలుపెట్టిన ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా అవతరించిందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఆక్సిలరేట్ ద ప్రోగ్రెస్ అనే థీమ్ తో ముందు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళల ప్రగతే సమాజాభివృద్ధి అనే స్వామి వివేకానంద గారి మాటలను గుర్తు చేశారు.
నీరు దాని ప్రాముఖ్యత మరియు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం బ్యూటీషియన్ మరియు టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న మహిళలకి సర్టిఫికెట్స్, ఆటలలో గెలుపొందిన వారికి బహుమతులుఅందజేశారు.
ఈ కార్యక్రమంలో సంగీత,జె ఎన్ సింగ్ , లలిత కుమారి రామశాస్త్రి , పుష్పలత శ్రీనివాస్ , ఉద్యోగినులు ఇతర మహిళలు పాల్గొన్నారు.