Singareni
సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి
మందమర్రి నేటి ధాత్రి
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
లాభాలవాట 20 వేలు చెల్లించాలి
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల విజ్ఞప్తి.
సమస్యల పరిష్కారానికి మంత్రుల హామీ
ఈరోజు ప్రజాభవన్ లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలని, లాభాల వాటా 20, వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిని ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజాభవన్ కి వచ్చి ప్రజావాణి ఇంచార్జి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారితో కలిసి కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులను తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది.
సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు 1285 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూళ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఫలితంగా ఒక్కొక్క కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు 744/- రూపాయలు నెలకు 19 344 /-రూ పాయలవు నష్టపోతున్నారని మంత్రిగారికి తెలియజేశారు. ఇతర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టిపిసి, ఓఎన్జిసి , హెచ్ పి సి ఎల్ , ఐ ఒసిఎల్ , ఏపీఎండిసి స్టీల్ ఐటిసి సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జిఒ కు అదనంగా మూడు వేల నుండి 5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేసియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఒల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవో కు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, క్యాటగిరి ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.
వేతనాల పెంపుదల సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ:
కార్మికుల వినతి పై స్పందించిన ఉపముఖ్య మంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి యొక్క వేతనాలు పెంచేందుకు,లాభాల వాటా పెంచెందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికొసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి జేఏసీ నాయకత్వం సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి ని కలిసి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు కనీస వేతనాలు జి.ఒల పై చర్చించడం జరిగింది.
త్వరలో జి.ఒ లు ఇస్తాం కార్మిక శాఖా మంత్రి హామి :
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచుతామని. రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన వేతనాలను పెంచిన అనంతరం సింగరేణిలో అదనంగా చెల్లించాల్సాన వేతనాల గురించి చర్చిస్తామని. మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అనుగుణంగా వేతనాలు అమలు చేస్తామని మిగతా సమస్యలైన ఈఎస్ఐ అమలు, పెయిడ్ హాలిడేస్ , 15 లక్షల నష్టపరిహారం కేటగిరి ఆదారంగా వేతనాలు చెల్లించడం తదితర అంశాలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
కనీస వేతనాలు సలహా మండల చైర్మన్ ఐన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ కార్మికులకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డులో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని జీవోలు వచ్చేంతవరకు ప్రభుత్వంపై జిఒశకుళ అదనంగా వేతనాలు పెట్టించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తానని, జేఏసీ పోరాటాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాల్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యంలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు.

మంత్రులు, సి & ఎండి గార్లు కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై స్పందించిన హామీలు ఇచ్చినందుకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశరు. ఇచ్చిన హామీలను అమలు చేయని , పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు , యాకూబ్ షా వలి ,కరుణాకర్ ,యాకయ్య , బాబు ,మల్లెల రామనాథం ,రామ్ సింగ్, భూక్యా రమేష్ , వేల్పుల కుమారస్వామి, అరవింద్, మహేందర్, ఒదేలు, రాజశేఖర్ , అరవింద్ , స్వామి , క్రాంతి, శరత్, రఘు, సాజిద్, అనిల్ , విజయ్, మధుసూదన్ రెడ్డి , సమ్మన్న , తిరుపతమ్మ , లక్ష్మి సారయ్య, సక్రం , రాజేష్, క్రాంతి, రాజేందర్ , రవి , రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.
అభినందనలతో.
సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
