
సైలెంట్‌గా ఓటీటీకి.. ధనుష్, నాగార్జున లేటెస్ట్ బ్లాక్‌బస్టర్
గత నెల జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన కుబేర సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసింది.
గత నెల జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం కుబేర (Kuberaa). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మొదటిసారిగా తన పంథా మార్చి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజైన ఫస్ట్ డే నుంచి పాజిటివ్టాక్తో రన్ అయి రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధింది పెట్టింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. హీరో ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika Mandanna) లు తమ కెరీర్లోనే బెస్ట్ ఫెర్ఫామెన్స్ తో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు. శేఖర్ కమ్ముల ఇలాంటి చిత్రాలు సైతం తీయగలడా అనే ప్రేక్షకులు షాక్ అవడం గమనార్హం.
కథ విషయానికి వస్తే.. ఓ బిలియనీర్ ఓ గ్యాస్ కంపెనీ కోసం రాజకీయ నాయకులకు వేల కోట్లలో ముడుపులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా పని పూర్తి చేయడం కోసం దీపిక అనే సస్పెండెడ్ సీబీఐ అధికారిని తీసుకు వస్తారు. దీపిక ఫ్లానింగ్ ప్రకారం ఓ నలుగురు బిచ్చగాళ్లను తీసుకువచ్చి వాళ్ల పేర మీద డబ్బు తీసుకువచ్చి లావాదేవీలు చేస్తారు. ఆ బిచ్చగాళ్లలో దేవ అనే కాస్త తెలివైన బెగ్గర్ కూడా ఉంటాడు. అయితే.. వారి పని ముగిసాక ముగ్గురు బిచ్చగాళ్లను చంపేస్తారు. సరిగ్గా అదే సమయంలో దేవ పేరు పైన ఉన్న డబ్బును డ్రా చేసే టైంలో దేవ వారి నుంచి తప్పించుకుంటాడు. దీంతో రూ.10వేల కోట్లు అతని పేరు పైనే ఉండిపోతాయి. దీంతో దీపక్, ఆ బిలియనీర్ గ్యాంగ్ దేవను కని పెట్టడానికి రంగంలోకి దిగుతారు.
ఈక్రమంలో దేవకు తన వెనుక జరుగుతున్న, జరిగిన కథ అంతా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవ ఏం చేశాడు తనను వెండిస్తున్న వారి నుంచి తప్పించుకోగలిగాడా లేదా, తమ పేరుపై జరిగిన కుట్రలను బయటి ప్రపంచానికి ఎలా తెలిపాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తెలుగులో పాటు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్సయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఎంచక్కా ఇంటి పట్టునే ఉండి వీక్షించవచ్చు.