గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొదటివెయ్యి రోజుల ప్రాముఖ్యత వెయ్యి రోజులు అంటే గర్భిణీ దశ 270రోజులు ఒక సంవత్సరము బాబు 365 రోజులు రెండు సంవత్సరాల బాబు 365 రోజులు మొత్తం1000 రోజులు గూర్చి తల్లులకు అవగాహన కలిగించనైనది పోషణ పంచ సూత్రాలు హ్యాండ్ వాష్ శానిటేషన్ డయేరియా రక్తహీనత వెయ్యి రోజులు యోగ యొక్క ప్రాముఖ్యత కౌమారదశ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వర్షపు నీటి పరిరక్షణ ఆయుష్ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జీవితం రక్తహీనత పెరుగుదల పర్యవేక్షణ పరిసరాల పరిశుభ్రత స్వదేశీ బొమ్మలను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల ప్రాముఖ్యత బాల్య రంభ విద్య ఇ సి సి ఇ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కార్నర్సును ఏర్పాటుచేసి పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరలు ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలు రాగులు, సజ్జలు ,సాదులు కొర్రలు అండ్ కొర్రలు జొన్నలు అనగా కదివేపాకు చిరుధాన్యాల పైన అవగాహన కలిగించి రోజు ఆహారంలో తీసుకొనవలెనని తల్లులకు అవగాహన కలిగించినది. ఈ కార్యక్రమంలో అన్న ప్రసన్న అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి ,నర్మదా, గంగాభవాని ఆశా కార్యకర్తలు వకుల స్వప్న,వి వో ఏ సులోచన గర్భిణీలు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు