
Siddhi Vinayaka Temple
సంకటహర చతుర్థి…………
◆:- ముస్తాబైన సిద్ధి వినాయక దేవాలయం
రేకులతో రెయిన్ ప్రూఫ్ ఏర్పాట్లు పాదయాత్రగా చేరుకోనున్న భక్తులు 24 గంటల పాటు దైవ దర్శనం స్వామి చెంతకు మూడు రాష్ట్రాల భక్తులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: కోరినంతనే భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చి కష్టాలు హరించే దేవదే వుడు, మహిమాన్వితమైన రేజింతల్ సిద్ది వినాయక స్వామి అయనకు అత్యంత ప్రీతి పాత్రమైన నేటి అంగారక సంకటహర చతుర్జన భక్తులు దర్శించుకునేందుకు రేజింతల్ సిద్ది వినాయక దేవాలయం ముస్తాబయింది.
24గంటల పాటు భక్తులు వినాయకుడిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యద రులు రేజింతల్ అశోక్, అల్లాడి వీరేశంల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు అంతరాయం కలగకుండా క్యూలైన్ పొడవునా రేకులు ఏర్పాటు చేశారు. వినాయకుడికి విశిష్టమైన రోజు మంగళవారం వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్తిగా పేర్కొంటూ భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ ప్రత్యేక మైన రోజునాడు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక కు చెందిన సుమారు లక్షకుపైగా భక్తులు దర్శించుకుం టారని అంచనా ఈ దీనం భక్తులు ఉపవాసం ఉండి మహిమాన్విత రేజింతల్ వినాయకుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ప్రతి నెలలో నచ్చే చతుర్థిని సంకటహర చతుర్ధిగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చే మంగళవారం నాటి సంకటహర చతుర్థిని అంగారక చతుర్థిగా ప్రసిద్ధి ఈ రోజు కున్న ప్రాముఖ్య తను దృష్టిలో ఉంచుకొని ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంచనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా. హద్నూర్ పోలీసులు అన్ని ఐంరోజన్లు చర్యలు చేపట్టారు.