సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ అందుకున్న సిద్ధార్థ్ రాజ్

సి.వి రామన్ టాలెంట్ టెస్ట్ లో, వరంగల్ “సంఘమిత్ర టెక్నో స్కూల్” విద్యార్థికి మొదటి ర్యాంకు

హైదరాబాద్ లో సుచిరిండియా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం

31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సామాజిక సేవాసంస్థ సూచిరిండియా ఫౌండేషన్

నేటిధాత్రి, వరంగల్

సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో, వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 1500పాఠశాలల నుండి ఒక లక్ష మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు. అందులో 16మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 16 మంది స్టేట్ ర్యాంకర్స్‌కి, అలాగే 396 మంది విద్యార్థులకు డిస్ట్రిక్ ఫస్ట్ ర్యాంకర్స్‌, టీచర్లకు 8మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్ర స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని, శ్రీసత్యసాయి నిగమాగమంలో అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా వరంగల్ జిల్లా దేశాయిపేట రోడ్డులో ఉన్న “సంఘమిత్ర టెక్నో స్కూల్” లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి కందికొండ సిద్ధార్థ్ రాజ్ రాష్ట్ర వ్యాప్తంగా 4వ ర్యాంకు, వరంగల్ జిల్లా మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా హైదరాబాద్ లోని సాయి వేడుకల మందిరంలో నిర్వహించిన అవార్డ్స్ ఫంక్షన్ లో ముఖ్య అతిథి ప్రముఖ శాస్ర్తవేత్త డాక్టర్ సతీష్ రెడ్డి, అలాగే ప్రముఖ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా సిద్ధార్థ్ రాజ్ అవార్డ్ అందుకున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ రాజ్ మాట్లాడుతూ సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్, వెంకట్ రెడ్డి సార్, స్కూల్ టీచర్ల ప్రోద్బలంతో జిల్లా ర్యాంకు సాధించాను అని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!