ఎండపల్లి నేటిదాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఇటీవల స్థానిక ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్ చేసిన ఆరోపణలపై తాజా మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి స్పందిస్తూ ఎలాంటి అవినీతి చేయలేదని నేను చేసిన గ్రామ అభివృద్ధిని ,నాపై ఉన్న ప్రజాధారణ చూసే ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కనీస గ్రామ సభలకు కూడా హాజరు కానీ వారు, ఏనాడు గ్రామానికి కనీస నిధులు తేలేని వ్యక్తులు, గ్రామాభివృద్ధినీ పట్టించుకోని వారు ఈరోజు నా మీద తప్పుడు ఆరోపణ చేయడం హాస్యాస్పదం ఇప్పటికైనా నామీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు రుజువు చేస్తే నేను ఏ శిక్ష కైనా రెడీ అని బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు,
అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా మాజి సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి
