భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం.జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఐఏఎస్ ఆదేశానుసారం ఐకెపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీలో
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై
అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా. డాక్టర్ మహేందర్. మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి మన శరీరంలోని హిమోగ్లోబిన్ పై ప్రభావితాన్ని చూపిస్తుందని దాని ద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోయి రక్తహీనత వచ్చి మనిషి నీరసంగా,వ్యాధి నిరోధకత లేకుండా ,అనేక జబ్బుల బారిన పడతాడని అనగా గుండె నొప్పి, పక్షవాతం, పుపూస రక్త పోటు, అందత్వం, పిత్తాశయ రాళ్లు, గర్భధారణ సమస్యలు, అవయవ నష్టం తదితర వ్యాధులు రావచ్చని తెలియజేశారు. అందరూ సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేయించుకోవాలని దాని కొరకై వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో. ఏఎన్ఎం జ్యోతి రాణి. ఆశ వర్కర్ ధనలక్ష్మి. మరియు ఎర్రగడ్డ గ్రామ ప్రజలు
పాల్గొని.సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని అరికట్టాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.