చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన
ఉమ్మనవేని మల్లేష్ మూడు రోజుల క్రితం నైన్త్ పాక గ్రామ సెంటర్లో పని నిమిత్తము తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తన రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడో పడిపోయిందని చిట్యాల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా చిట్యాల పోలీసు వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ని గుర్తించిసోమవారం రోజున మల్లేష్ కి అప్పజెప్పడం అయినది అట్టి మొబైల్ ని గుర్తించడంలో సహాయపడిన ఉమెన్ కానిస్టేబుల్ కోమల కానిస్టేబుల్ లాల్ సింగ్ ని అభినందించిన చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్,ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాలొన్నారు.