శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని రౌడీషీటర్లకు అనుమాస్పద వ్యక్తులకు ఎస్సై పరమేశ్వర్ బుధవారం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వారిని ఉద్దేశించి మండలంలోని గ్రామాల్లో మంచి వాతావరణం కోసం పోలీసులకు సహకరిం చాలి. రౌడీయిజం చేసిన, ప్రజలను, మహిళలను ఇబ్బంది పెట్టిన, వ్యాపార స్తులకు ఇబ్బంది పెట్టిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని, గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రౌడీషీటర్లు అసాంఘికగా కార్యకలాపాలకు పాల్పడిన చట్టరీత్య కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు