చలి, పొగమంచుతో ప్రమాదాల ముప్పు: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ హెచ్చరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ప్రజలకు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ముఖ్య హెచ్చరికలు జారీ చేశారు. పెరుగుతున్న చలి, పొగమంచు కారణంగా ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని, రాత్రి, తెల్లవారుజామున అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధమని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ సూచనలు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ పేర్కొన్నారు.
