
Wardhannapet Gets New SHO, SI N. Saibaba
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయిబాబు
వర్ధన్నపేట, నేటిధాత్రి:
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ఐ ఎన్. సాయిబాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముల్కనూర్ పోలీస్ స్టేషన్ నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన వర్ధన్నపేటకు వచ్చి విధులు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన సాయిబాబు, స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తు, చట్టం – సవ్య వ్యవస్థల అమలు, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శక పద్ధతిలో వ్యవహరించడానికి కట్టుబడి ఉంటాను” అని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, యువతను నేరప్రవృత్తుల నుండి దూరంగా ఉంచి విద్య, ఉద్యోగ అవకాశాల దిశగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామాలల్లో, పట్టణాల్లో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో న్యాయపరమైన చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
నూతన ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ఎస్ఐ సాయిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.