
Sub-Inspector Randhir Reddy
వాహనాల తనిఖీ చేసిన ఎస్సై రణధీర్ రెడ్డి
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండల కేంద్రం శివారులో ఎస్సై రణధీర్ రెడ్డి మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి, నిషేధిత అంబార్ గుట్కాలు నిషేధం కోసం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసె న్సులు హెల్మెట్స్ లేని వారికి అపరాధం విధించి వాటిపట్ల అవగాహన కల్పించినట్లు ఎస్ఐ రణధీర్ రెడ్డి చెప్పారు.ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.