జిల్లా టాపర్ కావ్యశ్రీని సన్మానించిన ఎస్సై రఘుబాబు గౌడ్
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత బోధనలు
నేను మల్లంపల్లి హైస్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థినే
నాగార్జున సాగర్ డ్యాం ఎస్సై బూర రఘుబాబు గౌడ్
నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి:
ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి వరంగల్ జిల్లా టాపర్ గా నిలిచిన మల్లంపల్లి గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ తడుక కొమురయ్య సువర్ణ మనవరాలు జనగాం కావ్యశ్రీ ఘన సన్మానం జరిగింది.దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి హైస్కూల్ విద్యార్థినీ కావ్యశ్రీని అదే గ్రామానికి చెందిన ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న బూర రఘుబాబు గౌడ్ మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించారు.ఇదే స్పూర్తితో భవిష్యత్ పట్ల ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.ఈ సందర్భంగా ఎస్సై బూర రఘుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తను కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించి నేడు ఈ స్థాయిలో ఉన్నానని పూర్వ విద్యార్థి జ్ఞాపకాలను గుర్తుకుచేశారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఈ సందర్భంగా ఎస్సై రఘుబాబు గౌడ్ జిల్లా టాపర్ జనగాం కావ్యశ్రీకి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తాలూకా కొమురయ్య సువర్ణ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
