పత్తిపాక- నేరేడుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం కలి గేనా!

పత్తిపాక- నేరేడుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం కలి గేనా!

బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా!

ఇబ్బంది పడుతున్న ప్రజలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేటమండలం నేరేడు పల్లి గ్రామ ప్రజలు బ్రిడ్జి కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూ స్తున్నారు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా అధికారులకు చెప్పు కొస్తున్నారు తప్ప నేటికీ నూ తన బ్రిడ్జి నిర్మాణం చేపట్ట లేదు నేరుడుపల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావలసిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికారులు ప్రజాప్రతినిధుల కు వేడుకుంటున్న ఫలితం లేక పోతుందని ప్రజలు వాపోతు న్నారు.

ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్తులు

పత్తిపాక – నేరేడుపల్లి వెళ్లాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు అనేది గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు మండ లానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు వీళ్ళ తరబడి బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోక పోవడంతో గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది మండల గ్రామానికి అతి సమీపంలో ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించక పోవడం ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు గత ప్రభు త్వం రోడ్డు మార్గం వాగు దాకా వేసి కరెంట్ అన్ని ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల సంక్షేమ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు

బ్రిడ్జి నిర్మాణం జరిగితే

 

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నేరేడుపల్లి గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్లే దూర భారం తగ్గుతుంది. గ్రామ ప్రజలు చుట్టూ తిరిగి వెళుతు న్న డబ్బుల భారం పడు తుంది. పనులు ఆలస్యం ప్రయాణభారం ప్రజలపై పడుతుంది కాబట్టి బ్రిడ్జి నిర్మాణం చేస్తే 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. బ్రిడ్జి నిర్మాణం వల్ల గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఏండ్లుగా ఎదురుచూ స్తున్న ప్రజల ఆకాంక్ష నెరవేరే నా!

ఇప్పుడైనా పూర్తి చేస్తారా!

ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూ పులు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుం దని ప్రజలు ఎంతగా ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడై నా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version