
SI Krantikumaar Patel
స్వాతంత్ర్య దినోత్సవం: శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా – ఎస్సై క్రాంతికుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతికుమార్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.