నస్పూర్, మంచిర్యాల, నేటి ధాత్రి:
రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సిసిసి కార్నర్ లో న్యూ విజన్ స్కూల్ పిల్లలతో ప్రయాణికులకు గులాబీ పువ్వు అందించి హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నస్పూర్ ఎస్సై రవికుమార్ రోడ్డు భద్రత జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని హెల్మెట్, సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలి. తాగి డ్రైవింగ్ చేయకూడదు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడంతో చిన్నచిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించి గమ్యం చేరుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవికుమార్, ఏ ఎస్ ఐ సత్తయ్య, కానిస్టేబుల్ ఎస్. రాజు, తిరుపతి, రవి, సతీష్
న్యూ విజన్ స్కూల్ కరస్పాండెంట్ ఐలయ్య,
ప్రిన్సిపాల్ కరిష్మా, టీచర్స్ హారిక, సంధ్య, లావణ్య, సాయి ప్రసన్న, శివకుమారి, ప్రియాంక, అనూష, ఉదయ కీర్తన, రమ, రుబీనా, స్రవంతి, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.