
SI Dikonda Ramesh.
ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్స్ దీకొండ రమేష్..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి ప్రైవేట్ స్కూల్ బస్సులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ దీకొండ రమేష్ ఈరోజు స్కూల్ బస్ లను తనిఖీ చేసి డ్రైవర్స్ కు అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని,ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని స్కూలు బస్సులను నడిపే డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలి. ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా బస్సులను నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్ లలో పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని, మద్యం సేవించి వాహనం నడపవద్దు అని అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.