నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
ఈనెల 17న జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14 బాల బాలికల రెజ్లింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ మోటపోతుల శరత్ 50 కేజీల విభాగంలో మొదటి స్థానం, 62 కేజీల విభాగంలో అల్లే రుత్విక్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.అలాగే పులిసేరు సుసన్న, తడక వరుణ్ అనే విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనారు.కాగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో దుగ్గొండి ఎస్సై పరమేష్ అభినందించారు. క్రీడల పట్ల తనకున్న అనుభవాన్ని క్రీడాకారులతో పంచుకున్నారు.
దుగ్గొండి మండలానికి రాష్ట్రస్థాయితో పాటు జాతీయ స్థాయికి ఎంపిక కావాలని తెలుపుతూ క్రీడాకారులను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, ప్రిన్సిపాల్ శశిధర చారి, వైస్ ప్రిన్సిపాల్ రవి, ఏవో రమేష్ ,పి ఈ టి లు కార్తీక్, దేవేందర్, భరత్, అంజాద్ పాషా, కానిస్టేబుల్ రంజిత్, రాజశేఖర్ పాల్గొన్నారు.