శాయంపేట గ్రామాల్లో వైకుంఠధామ సమస్యలు

*ఆఖరి మజిలీ లోను ఎన్నో కష్టాలు!*

*పట్టించుకోని అధికారులు*

*అంత్యక్రియలకు అవస్థలు*

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో దహనసంస్కారా లకు ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు గత ప్రభు త్వం ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠ ధామాలను నిర్మిం చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే తంతు నడు స్తుంది కనీస వసతులు లేక దహనసంస్కారాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని స్మశానవాటికల్లో దారి గుండా చెత్తాచెదారంతో ఉంది.

*విద్యుత్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు*

శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వైకుంఠధామానికి ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు పంచాయ తీరాజు విద్యుత్ శాఖ సమన్వయం లోపం కారణంగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది దీంతో అంతక్రియల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి ఊరికి దూరంగా ఉండడంతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు భారీగా నిధులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించాలి

*అంత్యక్రియలకు ఇబ్బం దులు*

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన స్మశాన వాటికలు ఊరికి దూరంగా ఉండటంతో పాటు నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఊరికి సమీపంలో ఖాళీ స్థలంలో చెరువులు కుంటలు ఉన్న సమీపంలో అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరిచి వైకుంఠధామాలకు అందు బాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు

*స్మశానవాటికలు వినియో గంలోకి తీసుకురావాలి*

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో స్మశానవాటి కల్లో కనీస వసతులు లేక దహ న సంస్కారాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు న్నారు మండలంలో నిర్మించిన స్మశాన వాటికలు విద్యుత్ నీటి మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలకు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి స్మశానవాటికలో కనీస వసతులు కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు

*వైకుంఠధామంలో అన్నీ సమస్యలే*

ప్రతి వైకుంఠధామంలో బోరు, విద్యుత్ గదిలో తలుపులు అన్ని సౌకర్యాలు ఉండాలి అవేమి పట్టించుకోకుండా అధికారులు వైకుంఠదామాన్ని వదిలేశారు చివరికి ఎవరైనా అంత్యక్రియలు తీసుకెళ్తే అన్ని సమస్యలే ఏర్పడుతున్నాయి ఎంపీడీవో ,ఎంపీ, పంచాయతీ రాజ్ అధికారులు పట్టించుకోని దాఖనాలు లేవు. నిర్మాణంలో నాణ్యత పాటించక పోవడంతో కొన్ని వైకుంఠ ధామాలు పగు లు తున్నాయి గ్రామానికి అనుకూలంగా చివరన వైకుంఠ దామాలను నిర్మించారు. పం చాయతీ వీటిని కొంతమేర ప్రజలకు నీటిని అందుబా టులోకి తెచ్చిన అది కూడా తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడుతుంది అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వైకుంఠధామాల నీటి వసతి మౌలిక వసతులు లేకపోవ డంతో ప్రజలకు వినియోగం లేకుండా పోతుంది ప్రతి గ్రామంలో అదే పరిస్థితి నెల కొంది వసతులు లేకపోవ డంతో వైకుంఠధామాలు ప్రజలకు అంతిమ కష్టాలు ఏర్పడుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version