
ముఖ్యఅతిథిగా చించోడ్ అభిమన్యు రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా, గురువారం రోజు బాలానగర్ మండల కేంద్రంలో, మరియు రాజాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి, మారియమ్మ యాడి, సేవలాల్ మహరాజ్ ని దర్శించుకుని, బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ, బంజారాల జీవితాల్లో వెలుగులు నింపి, మనిషిగా పుట్టి మహర్షిగా మారీ నేడు అదే జాతి జనుల ద్వారా దైవత్వాన్ని పొంది పూజింపబడుతున్న ఆదర్శ మూర్తి, బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు.గిరిజన బిడ్డలు అభివృద్ధిలో మరింత పురోగమించాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు.