కరీంనగర్, నేటిధాత్రి:
జగిత్యాల కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో 22డిసెంబర్ 2024 ఆదివారం జరిగిన సీఎం కప్- 2024 ఉమ్మడి కరీంనగర్ జిల్లా తైక్వాండో పోటీలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీప్రగతి హైస్కూల్ చెందిన కె. విష్ణువర్ధన్(ఎడవ తరగతి) సబ్ జూనియర్ అండర్ ముప్పై ఐదు కిలోల విభాగంలో తైక్వాండో విభాగంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈసందర్భంగా విద్యార్థి విష్ణువర్ధన్ ను కరస్పాండెంట్ రాధాకృష్ణ, ప్రిన్సిపాల్ మునిందర్ రెడ్డి, డైరెక్టర్స్, కోచ్ సంతోష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు అభినందించారు