కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో తిమ్మాపూర్ ఎక్సైజ్ సిఐ ఎస్ బాబా, ఎస్సై శ్రీకాంత్ హజరై మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కాన్షియస్నెన్స్ క్లబ్ లో సభ్యులుగా ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులు ఉంటారని, ఏదైనా మాదక ద్రవ్యాల గురుంచి సమాచారం ఉంటే వీరికి తెలియజేసి మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరూ బాగస్వామ్యం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ భారతి, గురుకుల సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సాయి కిరణ్, రమేష్, మాలతి ఎక్సైజ్ సిబ్బంది రాజేశం, సురేష్ , మనోహర్ , దేవంపల్లి గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు రేనుకుంట బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, సీనియర్ జర్నలిస్ట్ మొగురం రమేష్, తదితరులు పాల్గొన్నారు.