మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమంలో బుధవారం రోజున శ్రీ అక్షయ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సమితి నస్పూర్ వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సీఎండీ డాక్టర్.మాలి రమేష్ మాట్లాడుతూ ఆర్ఎంపి డాక్టర్ కుమార్ కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ద్వారా అనాధలను,మతిస్థిమితం లేని వారిని చేరదీసి వారిని కంటికి రెప్పలా,స్వంత వారిలా చూసుకోవటం,అన్ని తానే అయి ఆదుకోవడం అతని యొక్క గొప్ప మనసుకి నిదర్శనమని,సమాజంలో చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తుల్ని చూస్తుంటామని అన్నారు.అలాగే ఆశ్రమంలో ఇక ముందు కూడా క్రమంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని,మనసున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు అందరూ కూడా తమకు తోచినంత సహాయాన్ని అనాధాశ్రమానికి అందించాలని డాక్టర్ మాలి రమేష్ కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఎండీ డాక్టర్.మాలి రమేష్,జాతీయ ప్రధాన కార్యదర్శి యండపల్లి ఆగస్టన్,కోశాధికారి యండపల్లి సుధీర్ కుమార్, ఉప కార్యదర్శులు యండపల్లి సుశీల,వేదకుమారి,అలుగునూరి లత,సూర సప్న,కంబాల శ్రీవాణి,గౌతమ్,ఉదయ్ కుమార్,గోగు తిమోతి,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు