శ్రవణ్ శాస్త్రికి ఉగాది పురస్కారం
@ జ్యోతిర్మిత్ర అవార్డు తో సత్కారం
@ ఆనందం వ్యక్తం చేసిన నెక్కొండ ప్రజలు
#నెక్కొండ, నేటి ధాత్రి:
వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, జ్యోతిష వాస్తు పండితులు శ్రవణ్ శాస్త్రి బూరుగుపల్లికి ఉగాది పురస్కారం ప్రధానం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు,జ్యోతిష పండితులతో విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన జ్యోతిష సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రిని సత్కరించారు.లబ్దప్రతిష్టులైన జ్యోతిష వాస్తు పండితులు, బహు జ్యోతిష గ్రంథ రచయితలు డాక్టర్ పుచ్చా శ్రీనివాసరావు , లక్కావజ్జుల విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి, ఆదిపూడి శివ సాయిరాం, విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ చైర్మన్ డ్యాగం విశ్వనాథం ,ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీకాంత్ శర్మ ల సమక్షంలో జ్యోతిర్మిత్ర అవార్డును, ఉగాది పురస్కారం అందించి శాలువా కప్పి సన్మానించి అభినందించారు.

నెక్కొండ ప్రాంతంలో జ్యోతిష వాస్తు రంగాలలో సేవలు అందిస్తూ ఇప్పటికే ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ అవార్డు, జ్యోతిష వాస్తు బ్రహ్మ,, జ్యోతిష పరిహార భాస్కర, బెస్ట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అవార్డు లను అందుకున్న శ్రవన్ శాస్త్రి తాజాగా ఉగాది పురస్కారాల్లో సత్కారం పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రవన్ శాస్త్రి మాట్లాడుతూ ఉగాది పురస్కారాల్లో ప్రముఖ పండితుల సరసన తన సేవలను గుర్తించి సత్కరించడం సంతోష మన్నారు. ఈ పురస్కారం వాస్తు జ్యోతిష రంగాల్లో తన బాధ్యతను మరింత సెంచుతున్నదన్నారు. ఈ సందర్భంగా పలు వాట్స్అప్ గ్రూప్లో లలో శ్రవణ శాస్త్రికి అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా నెక్కొండ ప్రజలు ట్రీట్ చేయడం గమనార్థం.