
నెక్కొండ ,నేటి ధాత్రి: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బిజెపి మండల నాయకులు సొంటి రెడ్డి వేణు రెడ్డి అంబాల రాంగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రమదాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని ఉన్న చెత్తాచెదారాన్ని చీపులతో కూర్చి గుడి ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో దీక్షకుంట మాజీ సర్పంచ్ పులి ప్రసాద్ గౌడ్, సందీప్, మాచర్ల రాజు, నెక్కొండ గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.