
Current Authorities.
కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా?
మందమర్రి నేటి ధాత్రి
కరెంట్ తీగలపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు.
అధికారులు స్పందించి కరెంట్ తీగలపై నుంచి కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా తప్పద్దు.
సంకె రవి
సిపియం మంచిర్యాల జిల్లా కార్యదర్శి.
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని దొర్లబంగ్లా.ఊరు రామకృష్ణపూర్ దారిలో ఉన్న కరెంట్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసుల ఇబ్బందిని గుర్తించి.ఈ రోజు సిపియం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి, దూలం శ్రీనివాస్ సీపీఎం మందమర్రి మండల కార్యదర్శి మాట్లాడుతూ…
కరెంట్ తీగలపై ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు పెరిగి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు బిక్కు బిక్కుమంటున్న అధికారులు స్పందించకపోవడమంటే ప్రజల ప్రాణాలంటే అధికారులకు ఎంత చులకన భావమో అర్థమవుతుందని సిపియం జిల్లా కార్యదర్శి విమర్శించారు.కొమ్మలు ఇరిగిపడితే సుమారు పది కరెంటు పోల్స్ విరిగిపోయి సుమారు మూడు నాలుగు లక్షల రూపాయల నష్టం జరిగే ప్రమాదం ఉంది. విద్యుత్ అధికారులు తమకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు.
ఇక్కడి ప్రజలు పదేపదే అధికారులకు చెప్పిన మాకు సంబంధం లేదు అనడం ఏమిటని అడుగుతున్నాము.కొమ్మలను తొలగించి రాబోయే నష్టాన్ని నివారించే బాధ్యత,ప్రజలకు నిరంతరం కరెంటు పిచ్చే బాధ్యత విద్యుత్ అధికారులకు లేదా.అని సందర్భంగా అడుగుతున్నాం. మీ నిర్లక్ష్యం మూలంగా ప్రజలు నష్టపోవాలా.వెంటనే అధికారులు స్పందించి కరెంట్ తీగలపై ఉన్నా చెట్ల కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా సైతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాళ్ల ప్రజలు పాల్గొన్నారు