దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు.
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని అధికారులు.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలో గల జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల నందు ఉపాధ్యా యుల కొరత ఉంది.
ప్రధానంగా పై తరగతులకువెళ్లే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. గణితము సాంఘిక బోధించే అధ్యాపకులే లేరా! అధికారులు ఏం చేస్తున్నారు! మన ఊరు మన బడి దుస్థితి ఇదా! ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లిపోగా మళ్లీ పాఠశాలలో చేరే వారు లేరా ఆఫీసర్లు ఏం చేస్తున్నారు.పాఠశాలలో బదిలీలు విద్యాబోధనపై ఫలితాలపై పడుతుంది ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసినప్పటికీ ఉపాధ్యాయులు లక్ష్యం చేరలేకపోతున్నారు దీని ద్వారా విద్యా వ్యవస్థ ఆశించిన ఫలితం రావడం లేదని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉత్తమ బోధన అందించే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది విద్యార్థులకు నష్టం కలిగించకుండా న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.