కరెంటు షాక్ తో షాపు దగ్ధం
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పట్టణానికి చెందిన మారం రాకేష్ కంప్యూటర్,ఆయిల్ షాపులు కరెంటు షాక్ తో దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంలోభారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా రూ.50 లక్షల అస్థి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలిపోయిన షాపుని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఎమ్మెల్యేను కోరాడు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి వర్తక, వ్యాపారస్తులు పలువురు ఆర్థిక సహాయాన్ని అందించారు.