బాలానగర్ / నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి గ్రామంలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాతృమూర్తి శశికళ రెడ్డి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 72 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 232 మంది విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శశికళ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, హరి సింగ్, ఖలీల్, హనుమంతు, యాదగిరి, రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.