Gold Prices Surge Again, Shocking Buyers
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గి పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
ముంబై, జనవరి 17: పేద, మధ్య తరగతి వారికి బంగారం అందని ద్రాక్షలాగా మారిపోయింది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. మధ్యలో కొంత తగ్గినా ఆ వెంటనే ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. నిన్న స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,400 దగ్గర ట్రేడ్ అయింది. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
