# నెక్కొండ, నేటి ధాత్రి: శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలను ఆయా గ్రామాల శివ భక్తులు ముస్తాబు చేశారు. మండలంలోని పనికర, ముదిగొండ, చంద్రుగొండ, గ్రామాలలో కాకతీయుల కాలంనాటి శివాలయాలు అలాగే నెక్కొండ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా శివ కళ్యాణాలు ప్రత్యేక అర్చనలు పూజలు జరుగుతాయి. మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్గా నూతనంగా ఎంపికైన కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అధిక సంఖ్యలో శివకళ్యాణాన్ని తిలకించుటకు భక్తులు రావాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.