కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ నుంచి నూతనంగా గెలుపొందిన వాకిట సునీత లక్ష్మారెడ్డిని భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం , సంగారెడ్డి జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బివి శివశంకర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. సునీత లక్ష్మారెడ్డిని కలిసిన వారిలో శివ శంకర్ రావు తో పాటు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.