మూడు రోజులపాటు కార్యక్రమాల నిర్వహణ
పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
ముఖ్య అతిథులుగా హాజరుకానున్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటగుళ్లు ముస్తాబయ్యాయి. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేడు శుక్రవారం ఉదయం గణపతి పూజతో కార్యక్రమా లు ప్రారంభం కానున్నాయి
సాయంత్రం ఏడు గంటలకు శివ కళ్యాణ మహోత్సవం జరగనుంది. కళ్యాణ మహోత్సవ క్రతువును ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు పావన రాజ్యలక్ష్మి దంపతులు నిర్వహించనున్నారు. శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శివరాత్రి పర్వదినం అనంతరం శనివారం ఉదయం స్వామివారికి మహా అన్నపూజ ఆదివారం సాయంత్రం శివపార్వతుల ఊరేగింపు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు, హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి పోతరాజు సాయి చైతన్య, కీర్తి దంపతులతో పాటు, పరకాల లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ లలితాదేవి రాజేశ్వర్ ప్రసాద్, భూపాలపల్లి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు, భూపాలపల్లి సిఐ దుమ్మాటి నరేష్ కుమార్ లక్ష్మి, పెద్దపల్లి ధర్మారం తహసిల్దార్ అంబటి రజిత సురేష్ దంపతులు హాజరుకానున్నారు. శివరాత్రి జాగరణకు వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.