
Shine School Students
ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు
నేటిధాత్రి, వరంగల్:

ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.